చిల్పకుంటలో 46 ఏళ్లుగా దసరా దూరం: రాజకీయ కక్షలతో పండుగకు సంకెళ్లు
రిపోర్టర్: శివ
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం చిల్పకుంట గ్రామంలో రాజకీయ ఆధిపత్య పోరు కారణంగా గత నలభై ఆరు ఏళ్లుగా దసరా వేడుకలు నిలిచిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీపీఎం, సీపీఐ(ఎంఎల్) వర్గాల మధ్య ఏర్పడిన కక్షలు, ఘర్షణల నేపథ్యంలో పోలీసుల ఆంక్షలతో పండుగ వాతావరణం కరువైందని అధికారులు తెలిపారు. నేటి యువతకు దసరా సంబురాలు అంటే ఏమిటో తెలియని దుస్థితి నెలకొనడంపై ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.