కోటపాడులో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బండారు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం కేంద్రంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్‌లో నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని స్థానిక ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడి అర్జీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన ఎన్డీయే కూటమి నాయకులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.