కేవలం 13 రోజుల వయసులో పాస్‌పోర్ట్ పొందిన ఏపీ చిన్నారి
రిపోర్టర్: హరి
స్థలం: శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన వజ్రపు అగస్య ప్రిన్సీ అరుదైన రికార్డు సృష్టించింది. పుట్టిన కేవలం 13 రోజులకే పాస్‌పోర్ట్ పొంది అంతర్జాతీయ రికార్డు సాధించింది. గతంలో ఉన్న రికార్డులను అధిగమించి యంగెస్ట్ పాస్‌పోర్ట్ హోల్డర్‌గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.