తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
రిపోర్టర్: నరేష్
స్థలం: విశాఖపట్నం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను అర్నాబ్ ముప్పు పొంచివున్న నేపథ్యంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ తుఫాను బాపట్ల - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధికారులను ఆదేశించారు. తీర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వెల్లడించారు.