మూడో పెళ్లి చేసుకున్న ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ కెరీ

రిపోర్టర్: రాము స్థలం: Los Angeles

ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ కెరీ తన ప్రియురాలు మిన్ ఆహాను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థలు వెల్లడించాయి. లాస్ ఏంజెలెస్ నగరంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిస్లో జరిగిన వేడుకలో తొలిసారిగా వీరు బహిరంగంగా కలిసి కనిపించారు. అరవై నాలుగు ఏళ్ల జిమ్ కెరీకి ఇది మూడో వివాహం కావడం విశేషం.