ఉద్దానం బిడ్డకు ఘన సన్మానం.. కొనియాడిన మాజీ మంత్రి శివాజీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వజ్రపుతూరు

వజ్రపుతూరు మండలం అక్కుపల్లిలో ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్ట్ పుక్కళ్ల కరుణ కుమారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, ఉద్దానం ప్రాంతం పోరాటాలకు నిలయమని, ఇక్కడి మహిళలు జర్నలిజం వంటి రంగాల్లో రాణించడం గర్వకారణమని పేర్కొన్నారు. తన తండ్రి సర్దార్ గౌతు లచ్చన్న బాటలో పయనిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నానని ఆయన గుర్తు చేశారు.