విజయనగరంలో ఉత్సాహంగా రోటరీ క్లబ్ నవతారోత్సవ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం రోటరీ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నవతారోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎస్వీఎన్ లేక్ ప్యాలెస్లో బుధవారం ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. చైర్మన్ ముకేశ్ మారుతీరాజే మాట్లాడుతూ పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీయడమే రోటరీ ఉద్దేశమన్నారు. ప్రెసిడెంట్ జగదీష్ బాబు, సభ్యులు చందు మనోజ్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాయ్స్, గర్ల్స్ కేటగిరీలలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఈ పోటీలు ఉత్సాహంగా సాగాయి.