చెంచు బిడ్డ ఘనత.. తొలి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు!

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అమ్రాబాద్

నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరుకు చెందిన ఆదిమ జాతి చెంచు విద్యార్థి విశ్వ చైతన్య అద్భుత ప్రతిభ కనబరిచాడు. మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ఎంబీబీఎస్ సీటు సాధించి తన కుటుంబంతో పాటు చెంచు జాతికే గర్వకారణంగా నిలిచాడు.

ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షలో 430 మార్కులు సాధించి విశ్వ చైతన్య ఈ ఘనత సాధించాడు. తండ్రి రాజేంద్రప్రసాద్ ప్రోత్సాహంతో వైద్య విద్యకు ఎంపికవడంతో.. స్థానిక చెంచు నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు కురిపించారు.