గాయకుడు జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతి వేడుకల్లో అస్సాం ప్రజల నివాళి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అస్సాం

ప్రముఖ అస్సామీ గాయకుడు, నటుడు జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని అస్సాంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జుబిన్ క్షేత్రలో వేలాది మంది అభిమానులు, కళాకారులు తరలివచ్చి సంగీత కార్యక్రమాలు, ప్రార్థనలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి గరిమా గార్గ్ మాట్లాడుతూ, ప్రజల హృదయాల్లో జుబిన్ భావజాలం, ఆయన ఆశయాలు సజీవంగా ఉన్నాయని, ఆయన జ్ఞాపకాలను అందరూ ప్రేమతో గుర్తుచేసుకుంటున్నారని భావోద్వేగంతో తెలిపారు.