ఢిల్లీ హైకోర్టులో సీజేపీ నేతల పిటిషన్ ఉపసంహరణ
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీ హైకోర్టులో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణ జరిగినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది. తమ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాల్ చేస్తూ వారు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం వ్యాఖ్యల నేపథ్యంలో పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. జెండా ఆవిష్కరణ కేసులో అరెస్టయిన వీరి కస్టడీపై మేజిస్ట్రేట్ ప్రక్రియను అనుసరించాలని హైకోర్టు సూచించినట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది.