ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఎస్సై పిలుపు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పండుగను సోదరభావంతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.