మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత కోట నియామకం: ఉత్తర్వులు జారీ
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి అలియాస్ గౌతమి శ్వేత కోటను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో వైకాపా సోషల మీడియా వేధింపులను ఎదుర్కొని తెదేపా తరఫున పోరాడిన ఆమెకు తాజాగా ఈ కీలక పదవి దక్కింది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.