పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి: ఎమ్మెల్యే వివేకానంద
రిపోర్టర్: గోపి
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
ఓటు ప్రాముఖ్యతను యువతకు తెలియజేసి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పేలా గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ సర్కిల్ పరిధిలోని గండిమైసమ్మలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలకవర్గానికి ఈ ఎన్నికల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.