ఎల్లమ్మ సినిమాలో కథానాయికగా రొమాంచకం బ్యూటీ అనంతిక ఖరారు

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

బలగం దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న 'ఎల్లమ్మ' చిత్రంలో కథానాయికగా అనంతిక సనిల్‌కుమార్ దాదాపు ఖరారయ్యారు. దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగే గ్రామదేవత కథ. ఇప్పటికే వీరిద్దరిపై ఫొటోషూట్ కూడా నిర్వహించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయనుంది. బలగం తరహాలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.