గల్ఫ్ ఏజెంట్ మోసాలపై జగిత్యాల జిల్లాలో బాధితుల నిరసన
రిపోర్టర్: హరి
స్థలం: జగిత్యాల
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని సర్పరాజుపూర్ గ్రామంలో గల్ఫ్ ఏజెంట్ సిమల్ల మధు తమకు రావాల్సిన బకాయి జీతాలు చెల్లించాలంటూ బాధితులు ఆయన ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గల్ఫ్‌లోని కంపెనీలో ఉద్యోగాల కోసం పంపి, జీతాల చెల్లింపుల్లో జాప్యం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఏజెంట్ ఫోన్లో స్పందించి తాను హైదరాబాద్‌లో ఉన్నానని, రేపు వచ్చి డబ్బులు ఇస్తానని చెప్పడంతో బాధితులు వెనుదిరిగారు.