తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్, ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో యూకే వర్సిటీల ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాలను సాధించడమే తమ టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.