ఈసీఐ నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు: జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్ ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు నిరసన పాదయాత్ర నిర్వహించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరిగాయని, ఫారం 6 మార్పులను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ఈ ప్రచారం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో భారీ భద్రత మధ్య సాగిన ఈ ఆందోళనలో ప్రతిపక్షాల అగ్రనేతలు పాల్గొన్నారు.