కట్నం వేధింపులతో భార్యను మేడపై నుంచి తోసి చంపిన భర్త

రిపోర్టర్: రాము స్థలం: ఉత్తర ప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం జరిగింది. ముప్పై లక్షల రూపాయల కట్నం, కారు కోసం భర్త గౌరవ్ తన భార్య ఆకృతిని ఇంటి మేడపై నుంచి కిందకు తోసి హత్య చేశాడు. వివాహం జరిగిన ఆరు నెలలకే ఈ ఘోరం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడైన భర్తను అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.