సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పాలసీ

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాలసీని తీసుకువస్తున్నట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న కంటెంట్ క్రియేటర్లకు ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలలో అవకాశం కల్పించనున్నారు. ఫాలోవర్లు, వ్యూస్ మరియు కంటెంట్ రీచ్ ఆధారంగా ఇన్ఫ్లుయెన్సర్లను వివిధ కేటగిరీలుగా విభజించి నిర్ణీత పారితోషికం చెల్లించేలా మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. ఆసక్తి గల వారు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వద్ద నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.