కసుమూరు దర్గాలో ఘనంగా గంధ మహోత్సవం, పాల్గొన్న ఏఆర్ రెహమాన్

రిపోర్టర్: నరేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా సర్వేపల్లి పరిధిలోని కసుమూరు దర్గాలో ప్రఖ్యాత గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, డ్రమ్స్ కళాకారుడు శివమణి పాల్గొని మస్తాన్ వలీని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.