ఇంట్లో అడుగుపెట్టిన కూతురు కోసం శ్రీనివాస కళ్యాణం నిర్వహించిన కెవ్వు కార్తీక్
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
ప్రముఖ కమెడియన్ జబర్దస్త్ కెవ్వు కార్తీక్ తన కూతురు మొదటిసారి సొంతిల్లు అడుగుపెట్టిన వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన నివాసంలో ప్రత్యేకంగా శ్రీనివాస కళ్యాణాన్ని జరిపించినట్లు ఆయన వెల్లడించారు. ఈ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా, ప్రస్తుతం ఆ చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.