పోలవరం మలేరియా మాత్రల విషాదంపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ: ఏపీ హైకోర్టుకు బాధ్యతలు
రిపోర్టర్: సురేష్
స్థలం: Alluri Sitharama Raju
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి బాలిక మృతి చెందిన ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. తెలంగాణకు చెందిన న్యాయవాది రాసిన లేఖ ఆధారంగా స్పందించిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం, తదుపరి పర్యవేక్షణ బాధ్యతను ఏపీ హైకోర్టుకు అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితులంతా సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు.