ఖమ్మంలో కొరివి కృష్ణస్వామి జయంతి వేడుకలు ఘనం

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరం త్రీ టౌన్ బోసు బొమ్మ సెంటర్లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్టల వెంకట నరసయ్య, జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్య, ఐక్యత, ఆత్మగౌరవం, సామాజిక చైతన్యం కోసం కొరివి కృష్ణస్వామి చేసిన సేవలను నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ముదిరాజ్ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు.