నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై వైకాపాకు ఊహించని షాక్!
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. 54 డివిజన్లను 72 డివిజన్లుగా పునర్విభజన చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ వైకాపా కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష విధానంలో జరగనున్న మేयर ఎన్నిక మరియు రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.