కర్నూలు జిల్లాలో భూకంపం.. ఆందోళనలో ఆదోని, ఆలూరు ప్రజలు
రిపోర్టర్: అశోక్
స్థలం: కర్నూలు
కర్నూలు జిల్లా ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో గురువారం రాత్రి భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. రాత్రి 7:50 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదైంది. పెద్ద శబ్దాలు రావడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు.