ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చోరీ కలకలం: నాలుగు వెంటిలేటర్లు మాయం

రిపోర్టర్: రాము స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో భద్రతా వైఫల్యాల వల్ల నాలుగు వెంటిలేటర్లు చోరీకి గురయ్యాయని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. సుమారు ముప్ పై లక్షల రూపాయల విలువైన ఈ పరికరాలు మాయం కావడంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పది మంది సిబ్బందికి మెమోలు జారీ చేశామని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.