శేరిలింగంపల్లిలో దేవీ నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఘనంగా అన్నదానం
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలో నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన అమ్మవారి పూజలు, అన్నదాన కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు బోయిని అనూష మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానికులకు అన్నప్రసాదాలు అందజేశారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య పరస్పర ఐక్యతను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.