ఆంధ్రప్రదేశ్ లో పైపుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లోకేష్ ఆహ్వానం
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కాకినాడ లేదా అనకాపల్లిలో పైపుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆస్ట్రల్ పైప్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అల్కేష్ పంచల్ ను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కోరారు. అహ్మదాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో వేగవంతమైన అనుమతులతో పాటు ఇతర రాష్ట్రాలకంటే మెరుగైన ప్రోత్సాహకాలు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని అల్కేష్ పంచల్ తెలిపారు.