తుపాను మృతుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: శివ స్థలం: West Godavari

అర్నబ్ తుపాను మృతుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల తక్షణ సాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విపత్తును ముందే గుర్తించి అప్రమత్తం చేయడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని విజయవంతంగా నివారించామని ఆయన పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం, పునరావాస కేంద్రాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, కేంద్రానికి నివేదిక పంపామని భరోసా ఇచ్చారు.