ప్రముఖ తమిళ సాహిత్యవేత్త సోలోమన్ పాపయ్య కన్నుమూత
రిపోర్టర్: రాము
స్థలం: తమిళనాడు
తమిళనాడుకు చెందిన ప్రముఖ ప్రాచీన తమిళ సాహిత్య ఉపన్యాసకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సోలోమన్ పాపయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తమిళ కళారంగం, సాహితీ లోకం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ దిగ్గజ నటుడు, వక్త మరణం తమిళ సాహిత్యానికి తీరని లోటని పేర్కొన్నారు.