విశాఖపట్నంలో గన్ మిస్ఫైర్: భద్రతా విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగా వద్ద కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన భద్రతా విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ అప్పలకొండ తుపాకీ ప్రమాదవశాత్తు మిస్ఫైర్ అయిందని అధికారులు తెలిపారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుండి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన ఛాతీ కింద భాగంలో తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది రక్తపుమడుగులో ఉన్న క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.