మంచిర్యాలలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు నరేష్ వెల్లడి
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్ తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు రైల్వే స్టేషన్ రోడ్డులోని గాంధీ పార్కులో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.