జపాన్‌లో బుల్లెట్ రైలు ఢీకొని కేరళ యువతి దుర్మరణం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కేరళ
జపాన్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళకు చెందిన 22 ఏళ్ల దేవిక వి. బుల్లెట్ రైలు ఢీకొని దుర్మరణం చెందింది. గిఫు ప్రిఫెక్చర్‌లో ఈ ప్రమాదం జరిగింది. మార్చిలో నర్సింగ్ అసిస్టెంట్‌గా జపాన్ వెళ్లిన ఆమె, సెప్టెంబర్ 2న ఏటీఎంకి వెళ్లి తిరిగి రాలేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడం కష్టమవడంతో, జపాన్‌లోనే అంత్యక్రియలు నిర్వహించి చితాభస్మాన్ని కేరళకు పంపనున్నారు.