'ఆ కోరిక తీరకుండానే కన్నుమూశాడు..': కేటీఆర్‌ను చూడాలని ఆశపడిన బాలుడు మృతి

రిపోర్టర్: అశోక్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావుబంజర్‌కు చెందిన బన్నే మణికంఠ (16) కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మరణానికి ముందు భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ప్రత్యక్షంగా చూడాలని కోరుకున్న బాలుడి చివరి కోరిక నెరవేరలేదు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇటీవల కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించినప్పటికీ, నేడు బాలుడు మృతి చెందడంతో మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.