విద్యుత్ కొనుగోళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అమరావతి విద్యుత్ శాఖ
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్‌శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డీప్ ఈ-బిడ్డింగ్ పోర్టల్ ద్వారా రోజూ 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది. అక్టోబరు నుంచి 2027 మార్చి వరకు యూనిట్ రూ.8 చొప్పున సగటున వెచ్చించి రోజుకు రూ.8 కోట్ల వ్యయంతో ఈ కొనుగోళ్లు చేపట్టనుంది.