టెక్ మార్కెట్లోకి కొత్త ఒప్పో ఫోన్లు: అద్భుతమైన ఫీచర్లతో విడుదల
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
దేశీయ మార్కెట్లో తన ఎఫ్ సిరీస్కు పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఒప్పో సంస్థ కొత్తగా ఎఫ్35 ప్రో, ఎఫ్35 మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గ్రూప్ సెల్ఫీలను ఇష్టపడే వారి కోసం 50ఎంపీ అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరాతో పాటు శక్తివంతమైన ఫీచర్లతో ఈ ఫోన్లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త స్మార్ట్ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ సైట్లతో పాటు ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.