భవిష్యత్తులో ఏఐ కంపెనీలను జాతీయం చేయాల్సి రావచ్చునన్న పలాంటిర్ సీఈఓ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నేషనల్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వచ్చే భారీ రిస్క్‌లు, లీగల్ సమస్యల వల్ల భవిష్యత్తులో ఏఐ కంపెనీలను ప్రభుత్వం జాతీయం చేయాల్సిన అవసరం రావచ్చునని పలాంటిర్ సీఈఓ అలెక్స్ కార్ప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ రంగానికి స్పష్టమైన నిబంధనలు, జవాబుదారీతనం అత్యంత అవసరమని పేర్కొన్న ఆయన, భారీ నష్టపరిహార ముప్పును తట్టుకోవడం కంపెనీలకు సాధ్యం కాదని స్పష్టం చేశారు.