జ్వరాలతో విలవిలలాడుతున్న నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల రద్దీ
రిపోర్టర్: User
స్థలం: నేలకొండపల్లి
వాతావరణ మార్పుల కారణంగా నేలకొండపల్లి మండలంలో జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కితకిటలాడింది. ఒక్కరోజే సుమారు 450 ఓపీ నమోదవగా, 30కి పైగా జ్వరం కేసులు బయటపడ్డాయి. 30 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రిలో 60 మందికి పైగా రోగులు అడ్మిట్ కావడంతో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.