నిరుద్యోగులకు భారీ ఊరట: ఆరు నెలల్లో పద్నాలుగు వేల ఉద్యోగాల భర్తీ
రిపోర్టర్: విజయ్
స్థలం: Kolkata
ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పద్నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమెన్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం భగినీ నివేదిత పథకాన్ని ఆమోదించామని, దీని ద్వారా అర్హులైన మహిళలకు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. అలాగే కర్మబంధువుల వేతనం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భోజన భత్యాన్ని పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.