2029 నాటికి మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లు: నారా లోకేశ్
రిపోర్టర్: రాము
స్థలం: విజయవాడ
విజయవాడలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య తేడా తెలియని వారు విమర్శలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే అత్యధికంగా 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.