వడ్లపూడిలో ఆర్టీసీ బస్ స్టాప్ను పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విశాఖపట్నం

గాజువాక నియోజకవర్గం 87వ వార్డు వడ్లపూడి బస్ స్టాప్ను పర్మినెంట్ బస్ స్టాప్గా మార్చాలని కూర్మన్నపాలెం డిపో మేనేజర్ను మాజీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం కోరారు. ఇరవై ఎనిమిది వేల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో రిక్వెస్ట్ స్టాప్ కారణంగా బస్సులు ఆగక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్ని బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.