రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రావి రాధాకృష్ణ బాధ్యతల స్వీకరణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ దేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రావి రాధాకృష్ణ గురువారం మంగళగిరిలోని ఏపీఎన్‌ఆర్‌టీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరి రవి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్, తెదేపా ఎన్‌ఆర్‌ఐ విభాగం కేంద్ర కమిటీ అధ్యక్షుడు పి.గురురాజా తదితరులు పాల్గొని ఆయన్ను అభినందించారు.