తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యతల్లోకి దూసుకొచ్చిన లెనిన్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: లక్సెట్టిపేట

మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రెటరీగా బన్నాల లెనిన్ నియామకం జరిగింది. తెలంగాణ రక్షణ సేన మంచిర్యాల జిల్లా సంయుక్త కార్యదర్శిగా లక్సెట్టిపేట పట్టణానికి చెందిన బన్నాల లెనిన్ నియమితులయ్యారు. ఈ మేరకు కవిత బుధవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. లెనిన్ గతంలో విద్యార్థి, ఓయూ ఉద్యమ నాయకులుగా పనిచేశారు. లెనిన్ సేవలను గుర్తించి కవిత ఆయనను మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.