జీసీసీ గ్యాస్ గోడౌన్ మూతతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులు

రిపోర్టర్: Thrinadh Rudi స్థలం: పెదబయలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో జీసీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్యాస్ గోడౌన్ మూతపడటంతో సుమారు 13 వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ కనెక్షన్లు ప్రైవేట్ ఏజెన్సీలకు బదిలీ కావడంతో సిలిండర్కు వెయ్యి రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. అదనంగా రవాణా ఖర్చుల రూపంలో మరో వంద రూపాయల వరకు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ జీసీసీ గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.