హైదరాబాద్లో అమల్లోకి క్యూర్ చట్టం: హైడ్రాకు పూర్తి స్థాయి చట్టబద్ధత

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో సమర్థవంతమైన పాలన అందించేందుకు రూపొందించిన క్యూర్ చట్టం అమల్లోకి వచ్చిందని అధికారులు తెలిపారు. డెబ్బై ఏండ్ల తర్వాత జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో నూతన క్యూర్ చట్టం అమలులోకి రానుందని వెల్లడించారు. ఈ చట్టం ద్వారా హైడ్రాకు చట్టబద్ధతతో పాటు అదనపు అధికారాలు లభించనున్నాయని, క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.