కొత్తకొత్తూరులో సోలార్ పవర్ ప్లాంట్ కోసం భూమి కేటాయింపు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
విద్యుత్ సమస్యల పరిష్కారానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో కొత్తకొత్తూరు గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ మంజూరైంది. రెవెన్యూ అధికారులు మూడు దశమాంశాల ఇరవై ఎకరాల భూమిని గుర్తించి విద్యుత్ ఏఈకి అప్పగించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, సర్పంచ్ మాలోత్ కళావతి, ఉపసర్పంచ్ వల్లాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.