ట్రాన్స్జెండర్ల రాజకీయ సాధికారతకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

ట్రాన్స్జెండర్ల రాజకీయ సాధికారతకు సంబంధించిన బిల్లుకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో మద్దతుగా మాట్లాడిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ను ట్రాన్స్జెండర్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఆదివారం ఉట్నూర్లోని క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని, ట్రాన్స్జెండర్ల హక్కులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.