న్యూజిలాండ్ టూర్: ఫిట్నెస్ సమస్యలతో భారత జట్ల ఎంపికలో జాప్యం
రిపోర్టర్: సునీల్
స్థలం: New Delhi
న్యూజిలాండ్ పర్యటన కోసం భారత్ వన్డే మరియు టెస్ట్ జట్ల ఎంపికను బీసీసీఐ సెలక్షన్ కమిటీ వాయిదా వేసింది. ఆటగాళ్ల ఫిట్నెస్ నివేదికల కోసం వేచి చూస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా మరియు రిషభ్ పంత్ ఫిట్నెస్ అంశంపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిపుణులు కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్ ఇరవై ఎనిమిదిన జట్లు బయలుదేరనున్నాయి అని బీసీసీఐ స్పష్టం చేసింది.