ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలు కలిగిరి మండలంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రావులకల్లు పంచాయతీ ఎస్సీ కాలనీలో పేదలకు నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.