యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కోదాడలో మెగా జాబ్ మేళా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: సూర్యాపేట

వతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కుటుంబాలలో ఆనందం నింపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఎమ్మెల్యే శ్రీమతి నలమాద పద్మావతి రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళా తమ జీవితంలో మర్చిపోలేని రోజని వారు అభివర్ణించారు. నిరుద్యోగ యువతకు భవిష్యత్తుపై భరోసా కల్పించే దిశగా ఈ కార్యక్రమం ఒక కీలక ముందడుగు అని వారు తెలిపారు.